ఫోటో, రేటుతో సహా వెబ్సైట్ నిర్వహణ.
అభివృద్ధి పధంలో దూసుకు పోతున్న విశాఖ నగరంలో అత్యంత పకడ్బందీగా నడుస్తున్న ఖరీదైన వ్యభిచార రాకెట్ ను పోలీసులు చేధించారు.
నెలకు 35 వేల రూపాయల అద్దె చెల్లించి ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఈ ముఠా గత కొంత కాలంగా ఈ రాకెట్ ను నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కొన్ని కారణాల వల్ల ఈ అపార్ట్మెంటు పేరు పోలీసులు బయటపెట్టలేదు.
అత్యంత ఖరీదయిన ఏ సి కార్లలో అన్నివయస్కుల అమ్మాయిలను విటులకు సప్ప్లై చేస్తూ కొంత కాలంగా ఈ వ్యాపారం నడుస్తుంది. తమ ఇరుగు పొరుగు వారికి మేము సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పరిచయం చేసుకున్న ఒక జంట చాలా పకడ్బందీగా ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు తెలిసింది. వీరి కదలికలను కొంత కాలంగా గమనిస్తున్న ఒక ఫ్లాట్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు వలపన్ని ఈ ముఠా గుట్టు రట్టు తేల్చారు.
ఈ ఫ్లాట్ అద్దెకు తీసుకున్న కాంచనతో పాటు మరో ఇద్దరు పంజాబ్ వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి నడుపుతున్న వైజాగ్ ఎస్కార్ట్స్ అనే వెబ్ సైట్ లో ఈ ముఠా తమవద్దనున్న అమ్మాయిలు, వారి వివరాలతో పాటు రేటు కూడా నమోదు చేసి వ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిసింది.
పోలీసులు వీరి వద్దనుండి 30 సిమ్ కార్డులు, అనేక బ్యాంకుల ఏ టి ఏం కార్డులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పూర్తి వివరాలు, గుర్తింపు కార్డులు తీసుకోకుండా ఇళ్లను అద్దెకు ఇవ్వవద్దని పోలీసులు అందరినీ హెచ్చరించారు.